బతికున్నప్పుడు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు.. చివరికి మరణించిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి కూడా అవస్థలేనా? మనిషి చివరి మజిలీ అయిన స్మశాన వాటికకే దిక్కులేని పరిస్థితి ఏర్పడిందా?

హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ హిందూ స్మశాన వాటిక దుస్థితిపై రాజకీయ దుమారం రేగుతోంది.

గత ఐదేళ్లుగా స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు లేవని, అంత్యక్రియలకు వచ్చే కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శేరిలింగంపల్లి BRS నాయకుడు అనిల్ రెడ్డి ఆరోపించారు.

నీటి సౌకర్యం లేకపోవడం, బట్టలు మార్చుకునేందుకు గదులు లేకపోవడం, స్మశాన వాటికకు వెళ్లే రహదారి అధ్వానంగా ఉండటం, పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆల్విన్ కాలనీ సర్కిల్ కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

మరి ఎల్లమ్మబండ స్మశాన వాటిక సమస్యలకు పరిష్కారం ఎప్పుడు?

*సందేశ్ టీవీ*
ప్రతి మాట విలువైనది.. ప్రతి దృశ్యం అరుదైనది!

వార్తల కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి.

Watch The Video