చీకటిని పారద్రోలుతూ.. వెలుగులను నింపే దీపావళి పండుగను హైదరాబాద్ వివేకానంద నగర్‌లోని *భాష్యం స్కూల్ VVN-LC బ్రాంచ్* విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు.

రంగురంగుల విద్యుత్ దీపాలు, పూల అలంకరణలు, సంప్రదాయ దుస్తుల్లో చిన్నారుల సందడి మధ్య పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి బండారు సుధా మాధవి విద్యార్థులకు పర్యావరణహిత దీపావళి, కాలుష్య నివారణ, అగ్ని ప్రమాదాల నివారణ, సామాజిక బాధ్యతపై విలువైన సందేశాన్ని అందించారు.

విద్యతో పాటు మానవీయ విలువలు, పర్యావరణ పరిరక్షణను విద్యార్థుల్లో పెంపొందించడమే లక్ష్యంగా ఈ వేడుకలు నిర్వహించారు.

🪔 వెలిగే ప్రతి దీపం.. జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి!

*సందేశ్ టీవీ*
ప్రతి మాట విలువైనది.. ప్రతి దృశ్యం అరుదైనది!

అందరికీ దీపావళి శుభాకాంక్షలు!

Watch The Video