*హైదరాబాద్‌లో నీటి కష్టాలు.. గుక్కెడు నీళ్ల కోసం సామాన్యుడి పాట్లు!*

ఐటీ హబ్‌గా, అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో సామాన్య ప్రజలకు కనీసం తాగునీరు కూడా సరిగ్గా అందని పరిస్థితులు ఎందుకు ఎదురవుతున్నాయి?

హాస్టళ్లు, పీజీలు, అద్దె గదులు, అపార్ట్‌మెంట్లు.. ఇలా నగరంలోని అనేక ప్రాంతాల్లో నీటి సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. బోర్లు ఎండిపోతుండటంతో వాటర్ ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ట్యాంకర్ల కోసం మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఎదురుచూడాల్సి వస్తోందనే పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.

*అక్టోబర్ 2026లో జలమండలి సరఫరా చేసిన ట్యాంకర్లు 2,20,887! గత ఏడాది అక్టోబర్‌లో ఈ సంఖ్య 87,056 మాత్రమే!*

ఈ గణాంకాలు నగరంలో పెరుగుతున్న నీటి అవసరాన్ని తెలియజేస్తున్నాయి.

మరోవైపు అక్రమంగా బోర్లు వేసి నీటిని వ్యాపారంగా అమ్మేవారిపై చర్యలు అవసరమే. కానీ ప్రజలకు ప్రత్యామ్నాయంగా నీటిని అందించే బాధ్యత ఎవరిది?

ట్యాంకర్ల సరఫరా పెంచాలి.. అక్రమ ధరలను నియంత్రించాలి.. హాస్టళ్లు, పీజీలు, కార్మికులు నివసించే ప్రాంతాలకు ప్రత్యేకంగా నీటి సరఫరా కల్పించాలి.

*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. ప్రజలకు నీటి పొదుపు పాఠాలు చెప్పడమే కాదు.. ప్రతి ఇంటికీ నీళ్లు అందించే కార్యాచరణ చూపించండి!*

నీళ్లు విలాసం కాదు.. మనిషి బతకడానికి కావాల్సిన కనీస హక్కు!

ప్రజల గొంతుకగా.. పాలకులను ప్రశ్నిస్తున్న ప్రజా గొంతుకగా..

*ఇది సందేశ్ టీవీ ప్రత్యేక కథనం!*

ప్రతి మాట విలువైనది.. ప్రతి దృశ్యం అరుదైనది!

మరిన్ని ప్రజా సమస్యలు, తెలంగాణ రాజకీయాలు, తాజా వార్తల కోసం Sandesh TVను Subscribe చేయండి.

Watch The Video