వాసవి అర్బన్ (Vasavi Urban) ప్రాజెక్టులో ఫ్లాట్ల కోసం ఎదురుచూస్తున్న బాధితులు మరోసారి ఆందోళన బాట పట్టారు. గత మూడు సంవత్సరాలుగా తమకు కేటాయించిన Flats అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంతింటి కల నెరవేరుతుందని ఆశతో భారీ మొత్తంలో డబ్బులు చెల్లించినప్పటికీ, ఇప్పటికీ తమకు Flats అప్పగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బాచుపల్లి (Bachupally)లోని Vasavi Urban Projectలో సుమారు 1,800 మంది Home Buyers తమ Flats కోసం ఎదురుచూస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. మూడు సంవత్సరాలుగా Construction పూర్తి కాకపోవడం, Possession విషయంలో స్పష్టత లేకపోవడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. తమ సమస్యలను పలుమార్లు సంబంధిత Management దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన రావడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

తమకు న్యాయం చేయాలని, వెంటనే Flats అందజేసేలా సంబంధిత అధికారులు మరియు Government జోక్యం చేసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. Home Loan EMIలు, అద్దె ఇళ్లు, ఇతర Financial Burdenలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. Vasavi Urban బాధితుల సమస్యకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుంది? 1,800 మంది కొనుగోలుదారులకు ఎప్పుడు సొంతింటి కల నెరవేరుతుంది? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

Watch The Video