తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో తుది ఓటర్ లిస్ట్‌లో చేర్చేందుకు 54,863 మంది ఓటర్లు అనర్హులుగా గుర్తించినట్లు ఎన్నికల సంఘం (Election Commission of India – ECI) వెల్లడించింది. ఓటర్ల వివరాల్లో తేడాలు, గత 2002 ఓటర్ లిస్ట్‌తో సంబంధాన్ని నిరూపించలేకపోవడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఎన్నికల అధికారుల వివరాల ప్రకారం, మొత్తం 92,87,963 మందికి SIR నోటీసులు జారీ చేయగా, 92,78,967 మందికి సంబంధించి Hearings పూర్తయ్యాయి. వీరిలో 91,72,454 మంది ఓటర్లను తుది జాబితాలో చేర్చేందుకు అర్హులుగా గుర్తించారు. మరోవైపు, అవసరమైన Documents సమర్పించని 21,514 మంది, 2002 ఓటర్ జాబితాతో సంబంధాన్ని నిరూపించలేని 33,349 మందిని అనర్హులుగా గుర్తించారు.
జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 13,436 మంది ఓటర్లు అనర్హులుగా గుర్తించబడ్డారు. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లాలో 4,933 మంది ఉన్నారు. హైదరాబాద్‌లో 2,472 మంది అనర్హులుగా గుర్తించారు. నవంబర్ 26 వరకు Claims and Objections ప్రక్రియ కొనసాగనుండగా, నవంబర్ 30న Final Voter List ప్రచురించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఓటర్లు తమ పేర్లు తుది జాబితాలో ఉన్నాయో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment