తెలంగాణ రాష్ట్రంలో బియ్యం ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య ప్రజలపై ధరల భారం పడకుండా వివిధ రకాల బియ్యానికి గరిష్ట రిటైల్ ధరలను (MRP) నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా బియ్యం కిలో ధర రూ.66 నుంచి రూ.79 మధ్య ఉండేలా ధరల పరిమితులను అమల్లోకి తీసుకొచ్చింది.
ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం బీపీటీ, కేఎన్‌ఎం రకం బియ్యం కిలో రూ.66కు మించకూడదు. ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా రకాల ధర కిలో రూ.74గా నిర్ణయించారు. హెచ్‌ఎంటీ, జేఎస్ఆర్ రకాల బియ్యం కిలో గరిష్టంగా రూ.79కే విక్రయించాలి. వ్యాపారులు నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేయకూడదని అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు బియ్యం నిల్వలు దాచిపెట్టడం, కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడంపై పౌరసరఫరాల శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. పదేపదే అక్రమాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment