దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు కీలక ప్రకటన చేసింది. ఆరు మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల నంబర్లను మార్చాలని నిర్ణయించింది. ఈ మార్పులు 2027 జనవరి 2 నుంచి అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్–ముంబై, కాచిగూడ–కుమట, నరసాపురం–నాగర్‌సోల్ మార్గాల్లో నడిచే రైళ్లు ఈ మార్పుల పరిధిలో ఉన్నాయి.

మరోవైపు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కీలక ఆధునీకరణను పూర్తి చేసింది. విమానాశ్రయంలోని రన్‌వే 09Rను CAT-III సామర్థ్యానికి అప్‌గ్రేడ్ చేసింది. దీంతో శీతాకాలంలో దట్టమైన పొగమంచు, తక్కువ విజిబిలిటీ పరిస్థితుల్లో కూడా విమాన కార్యకలాపాలు మెరుగ్గా నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. విమానాల ఆలస్యం, ఇతర విమానాశ్రయాలకు మళ్లింపులను తగ్గించడమే ఈ అప్‌గ్రేడ్ ప్రధాన లక్ష్యం.

ఈ ఆధునీకరణలో భాగంగా అత్యాధునిక రన్‌వే లైటింగ్, మానిటరింగ్ వ్యవస్థలు, స్టాండ్ మానూవరింగ్ గైడెన్స్ లైట్స్ ఏర్పాటు చేశారు. అలాగే లైటింగ్ వ్యవస్థలను పర్యవేక్షించేందుకు PLC-SCADA సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మార్పులతో శీతాకాలంలో ప్రయాణికులకు మరింత మెరుగైన విమాన సేవలు అందనున్నాయి.