హైదరాబాద్ నగర ప్రజలకు తాగునీటి కష్టాలు తగ్గించే దిశగా జలమండలి కీలక చర్యలు చేపట్టింది. నగరానికి అదనపు గోదావరి జలాలను తరలించేందుకు పనులను యుద్ధప్రాతిపదికన వేగవంతం చేసింది. నవంబర్ 15లోగా ఘన్‌పూర్ వద్ద పైప్‌లైన్ అనుసంధాన పనులను పూర్తి చేసి, రోజుకు అదనంగా 40 మిలియన్ గ్యాలన్ల (40 MGD) గోదావరి నీటిని హైదరాబాద్‌కు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ పనుల పురోగతిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) ఎండీ కె. అశోక్ రెడ్డి పరిశీలించారు. పనుల్లో జాప్యం జరగకుండా మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు కార్మికులతో పనిచేయించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన యంత్రాలు, అదనపు సిబ్బంది, ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేసి పైప్‌లైన్ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
మరోవైపు సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో గోదావరి జలాలను ప్రత్యామ్నాయ వనరుగా వినియోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. నవంబర్ 15 నాటికి పనులు పూర్తయితే నగరానికి అదనపు నీటి సరఫరా అందుబాటులోకి రానుంది. దీంతో ముఖ్యంగా సింగూరు, మంజీరా నీటిపై ఆధారపడే ప్రాంతాలకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది.
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment