ఉచిత పథకాలు కాదు.. ప్రతి విద్యార్థికి నాణ్యమైన ఉచిత విద్య అందించాలని CPI సంగారెడ్డి జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దిన్ డిమాండ్ చేశారు.

జహీరాబాద్ పట్టణంలో జరిగిన AISF ముఖ్య కార్యకర్తల సమావేశంలో సయ్యద్ జలాలుద్దిన్ పాల్గొని విద్యారంగ సమస్యలపై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను బలోపేతం చేయాలని, విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు.

అలాగే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయడం, విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయడం, ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను నియంత్రించడం వంటి అంశాలపై ఆయన డిమాండ్లు చేశారు.

ఈ సందర్భంగా నవంబర్ 16, 17 తేదీల్లో సంగారెడ్డి పట్టణంలో AISF జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

📍 స్థలం: జహీరాబాద్
🎙️ ముఖ్య అతిథి: సయ్యద్ జలాలుద్దిన్
🏫 విషయం: విద్యార్థుల సమస్యలు – ఉచిత విద్య – ప్రభుత్వ విద్యాసంస్థలు
📅 AISF జిల్లా మహాసభలు: నవంబర్ 16, 17

Watch The Video