విశాఖపట్నం వేదికగా 31వ CII Partnership Summit ఘనంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌ను Global Investment Hubగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి N. Chandrababu Naidu, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan, మంత్రి Nara Lokesh అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలను వివరించారు. Trade, Technology, Trust అనే అంశాలతో ఈ రెండు రోజుల Summit నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా Deputy CM Pawan Kalyan ఆంధ్రప్రదేశ్‌ను Trusted Global Investment Destinationగా అభివర్ణించారు. రాష్ట్రంలో Political Stability, Transparent Governance, Coastal Infrastructure, Green Energy వంటి అవకాశాలు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటాయని వివరించారు. మరోవైపు మంత్రి Nara Lokesh పెట్టుబడిదారుల కోసం Red-Carpet Investor Frameworkను ప్రకటించారు. ఇప్పటివరకు ₹22.6 లక్షల కోట్ల Investment Commitments వచ్చాయని, వాటిలో 73 శాతం ప్రాజెక్టులకు Regulatory Clearances లభించాయని వెల్లడించారు.

పెట్టుబడిదారులకు మరింత భరోసా కల్పించేందుకు ప్రభుత్వం Investors Protection Act తీసుకురావాలని యోచిస్తోంది. అలాగే Escrow-Based Incentives ద్వారా పారిశ్రామిక సంస్థలకు ప్రోత్సాహకాలు సకాలంలో అందించే చర్యలు చేపడుతోంది. Google AI Hub, Manufacturing, Green Energy, Technology రంగాల్లో పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ Summit ద్వారా ఏపీకి ఎన్ని కొత్త పెట్టుబడులు వస్తాయి? ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి? అన్నది ఆసక్తికరంగా మారింది