తెలంగాణ పోలీస్ శాఖలో భారీ పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 21 మంది IPS అధికారులను బదిలీ చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. Police Departmentతో పాటు పలు ప్రభుత్వ విభాగాల్లోనూ Senior IPS Officersకు కొత్త బాధ్యతలు అప్పగించింది. ఈ మార్పులతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
ఈ బదిలీల్లో అత్యంత కీలకమైనది హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ నియామకం. సీనియర్ IPS అధికారి మహేష్ మురళీధర్ భగవత్‌ను Hyderabad Police Commissionerగా ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహించిన V.C. సజ్జనార్‌ను Telangana Fire, Disaster Response, Emergency and Civil Defence విభాగం డీజీగా బదిలీ చేసింది.
మరోవైపు డాక్టర్ సౌమ్య మిశ్రాకు Women & Safety, SHE Teams, Bharosa విభాగాల బాధ్యతలు అప్పగించగా, స్వాతి లక్రాను Prisons Department DGగా నియమించారు. చారు సిన్హాకు Anti-Corruption Bureau (ACB) డీజీ బాధ్యతలు, డాక్టర్ అనిల్ కుమార్‌కు TGSRTC VC & MD బాధ్యతలు అప్పగించారు. ఈ IPS Reshuffleతో తెలంగాణలో Law & Order, Police Administrationలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో ఆసక్తిగా మారింది
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment