సైబరాబాద్ పరిధిలో ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఇకపై వివిధ ప్రభుత్వ సేవలు (Government Services) నేరుగా ఇంటి వద్దకే అందుబాటులోకి రానున్నాయి. MeeSeva Doorstep Delivery విధానం ద్వారా సర్టిఫికెట్ల కోసం MeeSeva కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే సేవలు పొందే అవకాశం కల్పిస్తున్నారు.
ఈ Doorstep Service ద్వారా Income Certificate, Caste Certificate, EWS Certificate, OBC Certificate, Family Membership Certificate, Encumbrance Certificate వంటి పలు ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చు. అలాగే Birth & Death Certificatesలో Corrections, పిల్లల పేర్ల నమోదు వంటి సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ సదుపాయం కోసం ప్రజలు 1100 Toll-Free Numberకు కాల్ చేయవచ్చు లేదా MeeSeva Portal ద్వారా Request నమోదు చేసుకోవచ్చు.
ఈ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు MeeSeva, Cyberabad Police, Society for Cyberabad Security Council (SCSC), Cyberabad Municipal Corporation (CMC) కలిసి పనిచేస్తున్నాయి. అయితే Doorstep Visit కోసం అదనంగా రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధిత Service Charges కూడా వర్తిస్తాయి. ప్రజలకు సమయం ఆదా కావడంతో పాటు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందనున్నాయి.
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment