మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఏజెన్సీ ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామంలో శ్మశాన వాటికకు వెళ్లేందుకు సరైన రోడ్డు లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వర్షాకాలంలో ఈ దారి పూర్తిగా బురదమయంగా మారుతుండటంతో, కనీసం మృతదేహాలను కూడా భుజాలపై మోసుకుంటూ నరకం చూడాల్సి వస్తోంది. ఈ సమస్యను పట్టించుకోని ప్రజాప్రతినిధుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా శాశ్వత రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు. ఈ దయనీయ పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాల కోసం సందేశ్ టీవీ (Sandesh TV) ప్రత్యేక కథనాన్ని వీక్షించండి!

Watch The Video