తెలంగాణ ప్రజలకు విద్యుత్ బిల్లుల రూపంలో మరో అదనపు భారం పడుతోంది. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు (DISCOMs) True-Up Charges వసూలు చేయడం ప్రారంభించాయి. దీంతో గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి వ్యాపార సంస్థల వరకు Electricity Bills పెరుగుతున్నాయి. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో విద్యుత్ కొనుగోలుకు అయిన అదనపు ఖర్చులను ఇప్పుడు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు.

తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (TGERC) మొత్తం రూ.7,635.22 కోట్ల True-Up Charges వసూలుకు అనుమతి ఇచ్చింది. ఇందులో రూ.5,420.23 కోట్లను వ్యవసాయేతర విద్యుత్ వినియోగదారుల నుంచి, మిగిలిన రూ.2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నుంచి వసూలు చేయనున్నారు. మొదట యూనిట్‌కు 30 పైసలు, ఆ తర్వాత యూనిట్‌కు 50 పైసల చొప్పున అదనపు ఛార్జీలు విధించనున్నారు.

ఈ True-Up Charges వసూళ్లు TGSPDCL పరిధిలో 29 నెలలు, TGNPDCL పరిధిలో 26 నెలల పాటు కొనసాగనున్నాయి. విద్యుత్ బిల్లులో ఈ అదనపు ఛార్జీలను ప్రత్యేకంగా చూపించాలని TGERC ఆదేశించింది. ఇప్పటికే పెరుగుతున్న ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు ఈ నిర్ణయం మరింత భారంగా మారుతోంది. అసలు True-Up Charges అంటే ఏమిటి? వినియోగదారులపై ఎంత అదనపు భారం పడనుంది? పూర్తి వివరాలు తెలుసుకోండి.