తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్లో 2026 ఏడాది ప్రత్యేకంగా నిలుస్తోంది. వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలతో మంచి విజయాలు అందుకున్న సూర్య.. తాజాగా ‘సీన్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూడు సినిమాల కలెక్షన్లు కలిపి రూ.600 కోట్ల మార్కును దాటే దిశగా సాగుతున్నాయి.
జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీన్’ సినిమాలో సూర్యతో పాటు నజ్రియా నజీమ్, నస్లెన్ కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 6, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సూర్య కెరీర్లో వరుస బాక్సాఫీస్ విజయాల పరంపర కొనసాగుతుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ‘సీన్’ సినిమా పైరసీకి అడ్డుకట్ట వేస్తూ మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా అనధికారికంగా రికార్డింగ్ చేయడం, కాపీ చేయడం, అప్లోడ్ చేయడం, డౌన్లోడ్ చేయడం, స్ట్రీమింగ్ చేయడంపై నిషేధం విధించింది. అక్రమ వెబ్సైట్లను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను కూడా ఆదేశించింది. సినిమా సన్నివేశాలు, పాటలను అనుమతి లేకుండా సోషల్ మీడియాలో షేర్ చేయకూడదని స్పష్టం చేసింది
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment