హాలీవుడ్లో DC స్టూడియోస్‌కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. స్కైడాన్స్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. DC స్టూడియోస్ సహ-సీఈఓలుగా వ్యవహరిస్తున్న జేమ్స్ గన్, పీటర్ సఫ్రాన్ తమ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. వారి స్థానంలో మార్వెల్ స్టూడియోస్ మాజీ ఎగ్జిక్యూటివ్ జెరెమీ లాచమ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మార్పులు డిసెంబర్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి.
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ప్రారంభ దశలో కీలక పాత్ర పోషించిన జెరెమీ లాచమ్కు సూపర్‌హీరో సినిమాల నిర్మాణంలో మంచి అనుభవం ఉంది. ఐరన్ మ్యాన్, ది అవెంజర్స్, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ, స్పైడర్ మ్యాన్: హోమ్‌కమింగ్ వంటి చిత్రాలకు ఆయన పనిచేశారు. ఇకపై DC సినిమాలు, టెలివిజన్, యానిమేషన్ విభాగాల సృజనాత్మక బాధ్యతలను ఆయన పర్యవేక్షించనున్నారు.
మరోవైపు జేమ్స్ గన్, పీటర్ సఫ్రాన్ పూర్తిగా తమ సృజనాత్మక పనులపై దృష్టి పెట్టనున్నారు. గన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మ్యాన్ ఆఫ్ టుమారో' సినిమా 2027 జూలై 9న విడుదల కానుంది. నాయకత్వ మార్పులు జరిగినప్పటికీ ఇప్పటికే నిర్మాణంలో ఉన్న కొన్ని DC ప్రాజెక్టుల్లో వీరిద్దరి ప్రమేయం కొనసాగనుంది. ఈ మార్పులతో DC సినిమాటిక్ యూనివర్స్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment