హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. కూకట్‌పల్లి పారిశ్రామిక ప్రాంతంలోని ఆస్బెస్టాస్ కాలనీలో పేపర్ కప్పులు, ప్లేట్ల తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

చూస్తుండగానే మంటలు పక్కనే ఉన్న గోదాములు, పరిశ్రమలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కనీసం మూడు కంపెనీలు పూర్తిగా దగ్ధమైనట్లు ప్రాథమిక సమాచారం. ఐదు ఆటోలు, ఒక డీసీఎం వాహనం మంటల్లో కాలిపోయాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, HYDRAA సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.

ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నప్పటికీ, ప్రమాదానికి అసలు కారణం అధికారిక విచారణలో తేలాల్సి ఉంది.

అసలు ప్రమాదం ఎలా జరిగింది? ఎంత ఆస్తి నష్టం జరిగింది? పరిశ్రమల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు అమలవుతున్నాయా?

పూర్తి వివరాలు ఈ వీడియోలో..

📺 ఇది మీ సందేశ్ టీవీ  
ప్రతి మాట విలువైనది.. ప్రతి దృశ్యం అరుదైనది!

మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి. 

WATCH THE VIDEO