ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యారంగంలో కీలక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28 యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) విద్యా విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. పీజీ విద్యలో అకడమిక్, నిర్మాణపరమైన మార్పులు తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందించింది.
ఈ సంస్కరణల్లో భాగంగా పీజీ కోర్సుల బోధన విధానం, విద్యా ప్రమాణాలు, యూనివర్సిటీల నిర్మాణ వ్యవస్థలో మార్పులు తీసుకురానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించడంతో పాటు మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా కోర్సులను తీర్చిదిద్దడంపై దృష్టి సారించనుంది.
రాష్ట్రంలోని 28 విశ్వవిద్యాలయాల్లో ఈ మార్పులు అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిర్ణయంతో ఏపీలో పీజీ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అయితే సంస్కరణలకు సంబంధించిన పూర్తి వివరాలు, అమలు విధానం వెల్లడికావాల్సి ఉంది.
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment