ఏలూరు జిల్లాలో పులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. వేలేరుపాడు మండలం కొత్తూరు గ్రామంలోకి ఓ పులి ప్రవేశించి బీభత్సం సృష్టించింది. గ్రామంలో పశువులపై దాడి చేయడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ ఘటనలో పులి దాడి కారణంగా ఒక ఆవు, రెండు దూడలు మృత్యువాత పడ్డాయి. గ్రామ పరిసర ప్రాంతాల్లో పులి సంచరించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ముఖ్యంగా పశువుల కాపరులు, రైతులు ఆందోళన చెందుతున్నారు.
పులి సంచారంతో కొత్తూరు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటవీ శాఖ అధికారులు పులి కదలికలపై నిఘా పెట్టి, ప్రజలకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment