ఇటీవల కురిసిన వర్షాలు, దీపావళి పండుగ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం ధరలు పెరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్యాబినెట్ సమీక్ష సమావేశంలో ఈ అంశంపై చర్చించారు.
వర్షాల ప్రభావం, పండుగ సమయంలో పెరిగే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మార్కెట్ పరిస్థితులపై నిరంతరం నిఘా పెట్టాలని సీఎం సూచించారు. నిత్యావసర వస్తువుల కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
ముఖ్యంగా కూరగాయలు, బియ్యం సహా ఇతర నిత్యావసర వస్తువులు సామాన్యులకు అందుబాటు ధరల్లో లభించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. మార్కెట్‌లో ధరల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment