BCCI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మెరిసి తద్వారా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాక ఈ రెండింటికే అధిక ప్రాధాన్యమిస్తూ దేశవాళీ క్రికెట్‌ను పక్కనబెడుతున్న పలువురు క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ షాకివ్వనుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. జట్టు నుంచి పలు కారణాల వల్ల సిరీస్‌ల నుంచి తప్పుకుంటున్న ఆటగాళ్లు (ప్రస్తుతం నేషనల్ టీమ్‌తో ఉన్నవారు, ఎన్‌సీఎలో ఉన్న సభ్యులు మినహా) తిరిగి జాతీయ జట్టులోకి రావాలంటే తప్పకుండా దేశవాళీ ఆడాలని నిబంధనను విధించిన బీసీసీఐ.. తాజాగా మరో షాకివ్వనుందట. రంజీలను పక్కనబెడుతున్న క్రికెటర్లకు ఐపీఎల్‌లో ఆడే ఛాన్స్‌తో పాటు వేలంలో కూడా అనర్హత వేటు వేయనున్నట్టు తెలుస్తున్నది.