నల్లగొండ : సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదానికి గురైంది. ఎమ్మెల్యే నందిత ప్రయాణిస్తున్న కారును నార్కట్‌పల్లి వద్ద ఓ టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే వెళ్తున్న కారు ముందు టైర్ ఊడిపోయింది. ఎమ్మెల్యే లాస్య తలకు స్వల్ప గాయమైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె సోదరి కూడా కారులోనే ఉన్నారు. నల్లగొండ బీఆర్ఎస్ సభ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.