KCR | రాజకీయాల్లో ఒకరు ఓడొచ్చు.. ఒకరు గెలవొచ్చు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మళ్లా మేం డబుల్ స్పీడ్‌తో అధికారంలోకి వస్తాం. అప్పుడు మేం గిట్లనే మాట్లాడాలా..? ఈ పద్ధతిని అనుసరించాలా..? అని కేసీఆర్ ప్రశ్నించారు. చలో నల్లగొండ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. నదుల నీళ్ల మీద నీకు అవగాహన లేదు. నన్ను అడిగితే నేను చెప్తుంటి. అడిగే సంస్కారం, తెలివి ఉండొద్దా..? అన్న గిట్ల అంటున్నరు.. కేఆఆర్ఎంబీకి అప్పజెప్పమంటున్నారు.. మమ్మల్ని ఎవరిని అడిగినా చెప్పేటోళ్లం కదా.. అప్పజెప్పడం, ఆగమావడం.. బడ్జెట్ ఆపి తీర్మానం పెట్టుడు ఇదేనా మీ తెలివి అని కేసీఆర్ నిలదీశారు.