రాష్ట్రంలో శిక్షణ పొందిన బీఈడీ, డీఈడీ విద్యార్థులకు శుభవార్త. డీఎస్సీకి అర్హత సాధించే విధంగా సాధ్యమైనంత తొందరగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహించాలని ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గత నెల 29 వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఎస్సీ రాయడానికి టెట్ తప్పనిసరి కావడంతో మరోసారి పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మంది అభ్యర్థులకు ఊరట లభిస్తుంది.