తెలంగాణలో సోలార్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు హిందుస్థాన్ పెట్రోలియమ్ కార్పొరేషన్ సుముఖత వ్యక్తం చేసింది. HPCL రెన్యువబుల్ ఎనర్జీ ప్రతినిధి బృందం బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసింది. ఆ మేరకు ప్రతిపాదనలపై చర్చించారు.