ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులతో కలిసి సోమవారం భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీరామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలను తీసుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో పాటు మంత్రివర్గ సహచరులు పాల్గొన్నారు.