లాస్య నందిని ఇకలేరనే విషయం కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు జీర్ణం చేసుకోలేకపోతున్నారు సాయి అన్న వారసురాలిగా కార్పొరేటర్ నుండి ఎమ్మెల్యే వరకు రాజకీయ ప్రస్థానం చేసిన లాస్య నందిని యాక్సిడెంట్లో మృత్యువాత పట్టారన్న వార్త అలజడి లేపింది. 30 ఏళ్లుగా కంటోన్మెంట్‌తో విడదీయలేని బంధం ఏర్పరుచుకున్న దివంగత ఎమ్మెల్యే సాయన్న వారసురాలిగా లాస్య నందిత అనతికాలంలోనే రాజకీయాల్లో ప్రత్యేకత చాటుకున్నారు. 2016లో కార్పొరేటర్‌గా గెలిచిన ఆమె ఐదేళ్ల పాటు సేవలందించారు. నాటి నుంచి కంటోన్మెంట్ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా కొనసాగుతూ వచ్చారు. సోదరి నివేదితతో కలిసి తండ్రికి అండగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే సాయన్న తన తర్వాత లాస్యను ఎమ్మెల్యే చేయాలని తపించేవారు. అయితే, దురదృష్టవశాత్తూ గతేడాది సాయన్న తన పదవీకాలం ముగియక ముందే మరణించారు. సాధారణ ఎన్నికలు ఏడాదిలోపే గడువు…