మేడారం : మేడారం (Medaram)మహాజాతరకు భక్తులు( Devotees) లక్షలాదిగా తరలివచ్చి తనివితీరా మొక్కులు చెల్లించుకొని తన్మయత్వం పొందుతున్నారు. కాగా, భక్తులు పోటెత్తడంతో మేడారం క్యూలైన్లలో తొక్కిసలాట నెలకొంది. సమ్మక్క భక్తులు-హిజ్రాలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడి చేసుకోవడంతో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి( injured). ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను ఆంబులెన్స్‌లో దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.