Thursday, January 16, 2025 | Sandesh TV Daily News
Logo

కాంగ్రెస్ హామీలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

news.title

ఎన్నికల షెడ్యూల్ కు గడువు మరో పక్షం రోజులే ఉన్నందున ఆ లోపే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి కాంగ్రెస్ పార్టీ తన చిత్తుశుద్ధిని నిరూపించుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని చూస్తుంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేలా కన్పిస్తోందన్నారు. “6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ నేతలకు 70 రోజుల గడువు ముగిసింది. నెలాఖరు తరువాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశముంది. ఆలోపే ఇచ్చిన హామీలను అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి”అని సూచించారు. రాష్ట్రంలో జీతాలకే డబ్బుల్లేని పరిస్థితి నెలకొందని, 2 నెలల్లోనే రూ. 10 వేల కోట్ల అప్పు తీసుకొచ్చి జీతభత్యాలు చెల్లిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎట్లా అమలు చేస్తుందో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 17కు 17 ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపిస్తే కేంద్రం వద్దకు వెళ్లి తెలంగాణకు అధిక నిధులు తీసుకొచ్చేందుకు అవకాశముందన్నారు. “బీజేపీ వైపు రాముడు, మోడీ ఉన్నాడు...... కాంగ్రెస్ వైపు రాహుల్, రజాకార్లు, కేసీఆర్ ఉన్నారని దుయ్యబట్టారు. ఎవరు ఏ వైపు ఉంటారో ప్రజలు తేల్చుకోవాలి.. రాముడి వారసుడైన మోడీ రాజ్యం కావాలా? రజాకార్ల రాజ్యం కావాలా? ఆలోచించండి”అంటూ ప్రజలను కోరారు.