తెలంగాణ కుంభమేళ మేడారం జాతర కోసం టీఎస్ఆర్టీసీ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఇప్పటికే వేలాది మంది జాతరకు వెళ్లి వస్తున్నారు. సమ్మక్క సారలమ్మలను (Sammakka Saralamma Jatara 2024) దర్శించుకుని బంగారాన్ని కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం జాతర నేపథ్యంలో ఆర్టీసీ వేలాది ప్రత్యేక బస్సులను నడుపుతోంది.ఈ బస్సులను ఆదివారం నుంచి ఫిబ్రవరి 25 వరకు నడిపించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 51 పాయింట్ల నుంచి, ఉమ్మడి వరంగల్జిల్లాలో 18 ప్రాంగణాల నుంచి ప్రత్యేకంగా 6000 బస్సులను నడిపిస్తోంది. ఈ ప్రత్యేక బస్సులను ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా బస్సులను నడిపేందుకు ఆర్టీసీ(TSRTC) అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.