ర్మపురి: ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో ఆయన కారు అదుపుతప్పి బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో లక్ష్మణ్ కారులోనే ఉన్నారని, ఆయనతోపాటు ఇతరులకు గాయాలయ్యాయయని చెప్పారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం కరీంనగర్ దవాఖానకు తరలించామని వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ధర్మపురి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.