న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి ఈడీ విచారణకు దూరంగా ఉన్నారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించి నేడు విచారణకు రావాలని ఈడీ (ED) అధికారులు కేజ్రీవాల్‌కు ఆరోసారి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈడీ విచారణకు సీఎం హాజరుకావడం లేదని ఆప్ (AAP) వర్గాలు వెల్లడించాయి. సమన్లు చట్ట వ్యతిరేకమని పేర్కొన్నాయి. ఈడీ సమన్ల చట్టబద్ధతపై కోర్టులో కేసు నడుస్తున్నదని తెలిపాయి. కోర్టులో కేసు ఉండగా ఈడీ మళ్లీ మళ్లీ సమన్లు పంపుతున్నదని పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కోర్టు నిర్ణయం వచ్చేవరకు ఈడీ ఆగాల్సిందేనని స్పష్టం చేశా