Thursday, January 16, 2025 | Sandesh TV Daily News
Logo

వచ్చే పార్లమెంటు ఎన్నికలపై కసరత్తు...

news.title

రాష్ట్రంలో సమర్థవంతంగా పాలన అందిస్తున్నారనే పేరు తెచ్చుకున్నారు. అసెంబ్లీలో విపక్ష బీఆర్ఎస్ పార్టీని గట్టిగా ఎండగడుతున్నారు. నెక్ట్స్ లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటడమే మిగిలి ఉంది. రాష్ట్రంలో ఉన్న 17 లోక్ సభ స్థానాల్లో మెజార్టీ సీట్లు సాధించడం లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నట్టు ఆయన సన్నిహితులు అంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఆశావాహుల పేర్లను తీసుకున్నారు. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక చేసే అవకాశం ఉంది. టార్గెట్ లోక్ సభ ఎన్నికలు గత లోక్ సభ ఎన్నికల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 3 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఈ సారి రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున కనీసం 8 లేదంటే 9 సీట్లు గెలుచుకోవాలని భావిస్తోంది. అందుకోసం క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో శుక్రవారం (నిన్న) కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు అసెంబ్లీ సీఎం ఛాంబర్‌లో సమావేశం అయ్యారు.లోక్ సభ ఎన్నికల్లో విజయం గురించి ఇరువురు సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సునీల్ కనుగోలు అందించిన వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే . అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు