మెదక్ సుందరికరణలో ఐ లవ్ సెల్ఫీ పాయింట్‌లతో పాటు మూడు సర్కిల్‌లు ఆధునీకరణ చేపట్టనున్నట్లు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. మెదక్ గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా జిల్లా కేంద్రం అన్నింటా వెనకబడి ఉందని అన్నారు. మెదక్ పట్టణం సుందరి కరణ కోసం రాందాస్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, ద్యాన్ చంద్ చౌరస్తా లు ఆధునీకరణ చేయనున్నట్లు తెలిపారు. మెదక్ వెల్ కం బోర్డుల వద్ద ఐ లవ్ మెదక్ సేల్ఫి అపాయింట్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ఏడుపాయల్లో పర్మనెంట్ షెడ్, ప్రత్యేక టాయిలెట్స్ నిర్మాణం చేపడతామని చెప్పారు. ఏడుపాయల మహా శివరాత్రి జాతరకు రెండు కోట్లు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రినీ కోరినట్టు తెలిపారు. అలాగే మెదక్ పట్టణంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం చిన్న వాటర్ అర్ వో పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మెదక్‌లో పార్క్‌లో సైతం ఆధునీకరణ పనులు సత్వరమే చేపట్టాలని కమిషనర్ ను ఆదేశించారు. గత పాలకులు ఇచ్చినట్టు హామీలకే కాకుండా పక్కా పనులు చేసి చూపిస్తామని అన్నారు. ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయడంతో పాటు మైనం పల్లి సోషల్ సర్వీస్ సేవలు నిరంతరం కొనసాగిస్తామని, బోర్లు, ఫిక్స్డ్ డిపాజిట్‌లు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతారావు పర్యవేక్షిస్తారని అన్నారు. ఒక్కొక్కటి గా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రజా పాలన పేరుతో అధికారులే గ్రామాల్లోకి వెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.