Thursday, January 16, 2025 | Sandesh TV Daily News
Logo

ఎమ్మెల్యే కారు ఢీకొని హోంగార్డు మృతి

news.title

Cantonment MLA Lasya Nanditha : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఢీకొని హోంగార్డు మృతి చెందారు. నల్గొండ సమీపంలోని చర్లపల్లి వద్ద ఈ దుర్ఘటన జరిగింది. కేసీఆర్ నల్గొండ సభ నేపథ్యంలో అద్దంకి-నార్కట్ పల్లి రహదారిపై పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ క్లియర్ చేస్తోంది. అదే సమయంలో ఎమ్మెల్యే లాస్య నందిత కారును మరో కారు ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే కారు పోలీస్ సిబ్బంది పైకి దూసుకెళ్లింది. హోంగార్డును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న హోంగార్డు కిషోర్ మృతి చెందారు. మరో హోంగార్డు గాయపడ్డారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే లాస్య నందిత క్షేమంగా బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు.