ACB | మేడ్చల్ మల్కాజ్‌గిరి : లంచం తీసుకుంటూ శామీర్‌పేట తహసీల్దార్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. తహసీల్దార్ కార్యాలయంలోనే ఓ వ్యక్తి నుంచి రూ. 10 లక్షలు లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ సత్యనారాయణను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంతో పాటు సత్యనారాయణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. పాస్‌బుక్‌ల కోసం రూ. 10 లక్షలు లంచం డిమాండ్ చేశాడు తహసీల్దార్. దీంతో బాధిత వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.