తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాదయాత్ర సందర్భంగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోత్కూరు మండలం అనాజిపురం గ్రామ సమీపంలో పాదయాత్రకు సంబంధించిన Convoy పైకి వేగంగా వచ్చిన లారీ దూసుకొచ్చింది. వెనుక నుంచి ఫార్చ్యూనర్ కారును ఢీకొట్టడంతో అది అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో ఎదురుగా వస్తున్న కారులో ప్రయాణిస్తున్న దంపతులు, వారి రెండేళ్ల చిన్నారితో పాటు డ్రైవర్ గాయపడినట్లు సమాచారం. అలాగే తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌లోని కారులో ఉన్న మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను నార్కట్‌పల్లిలోని Kamineni Hospital కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.
ప్రమాదం జరిగిన సమయంలో తీన్మార్ మల్లన్న వాహనంలో లేకుండా పాదయాత్రలో ముందుకు సాగుతుండటంతో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో పాదయాత్రలో పాల్గొన్నవారిలో ఆందోళన నెలకొంది.
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment