ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. రాజధాని ప్రాంతంలో ప్రముఖ హోటల్ సంస్థ Oberoi Group 5-Star Luxury Hotel ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. విశాఖపట్నంలో జరుగుతున్న CII Summit వేదికగా ఏపీ ప్రభుత్వం, ఒబెరాయ్ గ్రూప్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.174 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి 400 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.
మరోవైపు అమరావతి Outer Ring Road (ORR) ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. గతంలో నాలుగు ప్యాకేజీలుగా నిర్మించాలని ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును ఇప్పుడు రెండు ప్యాకేజీలుగా చేపట్టాలని నిర్ణయించారు. అంతేకాకుండా గతంలో ప్రతిపాదించిన Hybrid Annuity Model (HAM) స్థానంలో Build-Operate-Transfer (BOT) Model అమలు చేయాలని ప్రతిపాదించారు. మొత్తం 195.13 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మార్పులకు Public Private Partnership Appraisal Committee (PPPAC) ఆమోదం తెలిపింది.
ఈ మార్పుల నేపథ్యంలో National Highways Authority of India (NHAI) టెండర్ నిబంధనలను సవరించనుంది. BOT విధానంలో నిర్మాణ సంస్థలు రహదారిని నిర్మించి, నిర్ణీత కాలం పాటు నిర్వహించి, టోల్ ద్వారా పెట్టుబడిని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అయితే ప్రాజెక్టుకు సంబంధించి తుది కేంద్ర కేబినెట్ ఆమోదం రావాల్సి ఉంది. ఒబెరాయ్ హోటల్, Outer Ring Road ప్రాజెక్టులు పూర్తయితే అమరావతి మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ మరింత మెరుగుపడే అవకాశం ఉంది
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment