టాటా గ్రూప్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా (Noel Tata), టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ (N. Chandrasekaran) తిరిగి నియామకంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17న జరిగిన Tata Sons Board Meetingలో తీసుకున్న నిర్ణయాలపై వివరణ కోరుతూ కంపెనీకి లేఖ రాశారు.

చంద్రశేఖరన్ Reappointment ప్రక్రియలో సరైన విధానాలు పాటించలేదని నోయెల్ టాటా ప్రశ్నించారు. గత Board Meetingకు సంబంధించిన పూర్తి Audio and Video Recordings, Meeting Minutes అందించాలని కోరారు. అలాగే ఓటింగ్ విధానం, ఇతర డైరెక్టర్లకు సంబంధించిన Conflict of Interest అంశాలపైనా వివరణ కోరినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో నవంబర్ 26న జరగనున్న Tata Sons Board Meetingపై ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ 17 సమావేశానికి సంబంధించిన Minutes ఆమోదం, నోయెల్ టాటా అభ్యంతరాలు ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు Air India పనితీరు (Performance), ఆర్థిక పరిస్థితులపై కూడా బోర్డు సమీక్షించనుంది. టాటా గ్రూప్ భవిష్యత్ నాయకత్వం, వ్యాపార నిర్ణయాలపై ఈ సమావేశం కీలకంగా మారింది.