ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ IndusInd Bank కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ MD & CEO సుమంత్ కత్పాలియా (Sumant Kathpalia) ఉద్యోగాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకులో జరిగిన Accounting Discrepancies, Misconduct ఆరోపణలపై నిర్వహించిన అంతర్గత విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.

మాజీ CEO పదవికి కత్పాలియా 2025 ఏప్రిల్‌లో రాజీనామా చేసినప్పటికీ, ఆయన బ్యాంకు ఉద్యోగిగా కొనసాగారు. అనంతరం 2025 జూన్‌లో Suspension విధించి Disciplinary Enquiry ప్రారంభించారు. నవంబర్ 18, 2026న విచారణ నివేదిక అందిన తర్వాత నవంబర్ 20న బ్యాంకు బోర్డు ఆయన ఉద్యోగాన్ని రద్దు చేయడంతో పాటు Malus and Clawback నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది.

ఈ నిర్ణయం ప్రకారం 2020 మార్చి 24 నుంచి ఆయనకు చెల్లించిన జీతం, బోనస్‌లు తదితర Compensationను తిరిగి రాబట్టేందుకు బ్యాంకు చర్యలు చేపట్టనుంది. అయితే ఎంత మొత్తాన్ని వసూలు చేయాలనే విషయాన్ని బ్యాంకు ఇంకా వెల్లడించలేదు. గతంలో బ్యాంకు Derivatives Portfolioలో వెలుగుచూసిన అకౌంటింగ్ లోపాల నేపథ్యంలో ఈ పరిణామం Banking Sectorలో చర్చనీయాంశంగా మారింది.