సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో క్షిపణి ముప్పు కలకలం సృష్టించింది! ప్రపంచ ఆర్థిక రంగంలో కీలకమైన కింగ్ అబ్దుల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (PIF) కార్యాలయాలు ఉన్న భారీ ఆకాశహర్మ్యం దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ వార్తా కథనాలు వెల్లడించాయి.

నవంబర్ 19న జరిగిన ఈ ఘటనలో PIF టవర్‌లోని ఏడు నుంచి ఎనిమిది అంతస్తుల కిటికీలు ధ్వంసమైనట్లు సమాచారం. భవనం వెలుపలి నిర్మాణం కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

ఈ దాడి వెనుక యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారుల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షిపణి నేరుగా భవనాన్ని తాకిందా? లేక గాల్లో అడ్డుకున్న క్షిపణి శకలాల వల్ల నష్టం జరిగిందా? అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఇప్పటికే నవంబర్ 8న ఇదే ఆర్థిక ప్రాంతంలోని అరామ్‌కో భవనం కూడా దెబ్బతిన్నట్లు కథనాలు రావడంతో సౌదీ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.

రియాద్‌పై వరుస దాడుల వెనుక అసలు కారణాలేంటి? మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా?

పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.

Watch The Video