ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో నవంబర్ 21న ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒంగోలు సమీపంలోని పెళ్లూరు వద్ద జాతీయ రహదారిపై పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు కల్వర్టును ఢీకొని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో నూతన వధూవరులు శ్రీతేజ్, కైవల్య గాయపడ్డారు. వారిని వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఒంగోలు RIMS ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధికారులను ఆదేశించారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
మరోవైపు ఈ ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన Medical Treatment అందించాలని అధికారులకు సూచించారు. పెళ్లి వేడుక అనంతరం తిరుగు ప్రయాణంలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment