సాయిబాబా నగర్‌లో పెన్షన్ల పంపిణీలో గందరగోళం.. BRS నాయకుల జోక్యంతో మళ్లీ ప్రారంభం!
హైదరాబాద్‌లోని సాయిబాబా నగర్ డివిజన్‌లో పెన్షన్ల పంపిణీ సందర్భంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. లూయిస్ బ్రెయిల్ భవన్‌లో జరిగిన నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం.
పెన్షన్ల పంపిణీలో R.P.ల వ్యవహారశైలిపై పలువురు లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న BRS నాయకులు సురేష్ రెడ్డి, వారాల వినోద్ కుమార్, పోలే శ్రీకాంత్, గుబ్బల లక్ష్మీనారాయణ, రాజ్ కుమార్ ముదిరాజ్, వేణు ముదిరాజ్, కిషోర్ ముదిరాజ్ తదితరులు అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడారు.
అనంతరం సంబంధిత అధికారులతో చర్చించి, R.P.లను అందుబాటులోకి తీసుకొచ్చి పెన్షన్ల పంపిణీ తిరిగి ప్రారంభమయ్యేలా చొరవ తీసుకున్నారు.
అసలు పెన్షన్ల పంపిణీలో ఏం జరిగింది? R.P.లపై లబ్ధిదారులు చేసిన ఆరోపణలు ఏమిటి? BRS నాయకులు ఎలా స్పందించారు? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
ప్రజా సమస్యలపై ప్రశ్నిద్దాం.. బాధితుల గొంతుకగా నిలుద్దాం..
మీ సందేశ్ టీవీ..
ప్రతి మాట విలువైనది.. ప్రతి దృశ్యం అరుదైనది!
Watch The Video
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment