ముంబైలోని ధారావి (Dharavi).. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన మురికివాడల్లో ఒకటి. Slumdog Millionaire వంటి సినిమాల ద్వారా ధారావి అంటే పేదరికం, నేరాలు, ఇరుకైన వీధులు అనే అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. కానీ ఆ తెర వెనుక లక్షలాది మంది ప్రజల కష్టం, శ్రమ, పట్టుదలతో నడుస్తున్న ఒక భారీ చిన్న తరహా పరిశ్రమల (Small Scale Industries) ఆర్థిక వ్యవస్థ ఉంది. తోలు వస్తువుల తయారీ (Leather Industry), కుండల తయారీ (Pottery), ప్లాస్టిక్ రీసైక్లింగ్ (Recycling), వంటి అనేక వ్యాపారాలకు ధారావి కేంద్రంగా నిలుస్తోంది.

ధారావి ప్రజలకు ఇది కేవలం నివాస ప్రాంతం మాత్రమే కాదు.. వారి జీవనోపాధికి (Livelihood), వ్యాపారాలకు, తరతరాలుగా కొనసాగుతున్న వృత్తులకు నిలయం. అయితే ఇక్కడ పారిశుధ్యం (Sanitation), తాగునీరు, ఇరుకైన నివాసాలు, మౌలిక సదుపాయాల (Infrastructure) కొరత వంటి సమస్యలు ఇప్పటికీ సవాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చేపట్టిన Dharavi Redevelopment Project స్థానిక ప్రజల్లో కొత్త ఆశలతో పాటు అనేక సందేహాలను కూడా కలిగిస్తోంది. పునరావాసం (Rehabilitation), ఇళ్ల కేటాయింపు, చిన్న వ్యాపారాల భవిష్యత్తు వంటి అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

2026 అక్టోబర్ నాటికి ధారావి పునరాభివృద్ధి (Dharavi Redevelopment) ప్రాజెక్టులో పునరావాస గృహాల నిర్మాణం, అభివృద్ధి పనులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి నెలకొంది. ఈ మార్పుల వల్ల ధారావి రూపురేఖలు ఎలా మారబోతున్నాయి? అక్కడ నివసిస్తున్న సామాన్య ప్రజలకు నిజంగా మెరుగైన జీవన ప్రమాణాలు లభిస్తాయా? తరతరాలుగా అక్కడే జీవిస్తూ వ్యాపారాలు చేసుకుంటున్న వారి భవిష్యత్తు ఏమిటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ, ధారావిలోని Ground Reality, ప్రజల అభిప్రాయాలు, సమస్యలు, ఆశలు, ఆకాంక్షలను ఆవిష్కరిస్తూ Sandesh TV అందిస్తున్న ప్రత్యేక Documentary కథనం.

Watch The Video