హైదరాబాద్‌లో Anti-Corruption Bureau (ACB) అధికారులు ఒకే రోజు రెండు సంచలన దాడులు చేసి, అవినీతి అధికారులకు నిద్రలేకుండా చేశారు. రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DMHO) స్వర్ణకుమారి ఒక ఫిజియోథెరపీ సెంటర్‌ను తిరిగి ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వడానికి రూ. 2 లక్షలు లంచం డిమాండ్ చేసి, అందులో రూ. 1 లక్ష తీసుకుంటుండగా ACB అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.
మరోవైపు, జీహెచ్‌ఎంసీ గోల్కొండ జోన్ Town Planning Supervisor సునీత భవన నిర్మాణ అనుమతి కోసం రూ. 8 లక్షలు డిమాండ్ చేసి, తొలి విడతగా రూ. 4 లక్షలు లంచం తీసుకుంటుండగా ACB అధికారుల చేతికి చిక్కారు. ఒకే రోజు జరిగిన ఈ రెండు భారీ లంచం డిమాండ్ Traps నగరంలో తీవ్ర కలకలం రేపాయి.
ఈ రెండు సంచలన ACB Raids కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు విజువల్స్ కోసం Sandesh TV లో ప్రసారమయ్యే ప్రత్యేక కథనాన్ని వీక్షించండి!
Watch The Video
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment