ప్రధానమంత్రి స్వనిధి (PM SVANidhi) పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించడం, తక్కువ వడ్డీకి రుణాలు (Loans) మంజూరు చేయడం, వారి జీవనోపాధిని మెరుగుపరచడంలో చూపిన ప్రతిభకు ఏపీకి మొత్తం 7 జాతీయ అవార్డులు లభించాయి. న్యూఢిల్లీలో (New Delhi) జరిగిన SVANidhi Samman Awards 2026 కార్యక్రమంలో ఈ పురస్కారాలను అందించారు.
ఈ అవార్డుల్లో రాష్ట్ర స్థాయిలో 3 గుర్తింపులు, పట్టణ స్థానిక సంస్థలకు (Urban Local Bodies – ULBs) సంబంధించి 4 అవార్డులు ఉన్నట్లు సమాచారం. పథకం అమలులో Overall Performance, Loan Performance, Special Campaigns వంటి విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది. కడప, విజయనగరం, రామచంద్రాపురం, అమలాపురం వంటి పట్టణాలకు కూడా వివిధ విభాగాల్లో జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.
న్యూఢిల్లీలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో ఏపీ మెప్మా (MEPMA – Mission for Elimination of Poverty in Municipal Areas) అధికారులు పురస్కారాలను అందుకున్నారు. PM SVANidhi పథకం ద్వారా వీధి వ్యాపారులకు Financial Inclusion, Business Development, ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఏపీకి లభించిన ఈ జాతీయ గుర్తింపు పట్ల రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ హర్షం వ్యక్తం చేశారు
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment