హైదరాబాద్‌లోని నాగోల్ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా చెట్టు కూలి మీద పడటంతో 29 ఏళ్ల Software Employee అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
పోలీసుల వివరాల ప్రకారం, మృతుడిని వి. సాయికుమార్ (29)గా గుర్తించారు. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు రాజీవ్ గృహకల్ప సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఎండిపోయిన చెట్టు ఒక్కసారిగా కూలి సాయికుమార్‌పై పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న నాగోల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగరంలో ఎండిపోయిన, ప్రమాదకర స్థితిలో ఉన్న చెట్లను గుర్తించి తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. చెట్ల నిర్వహణపై సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment