ఆంధ్రప్రదేశ్లోని రాప్తాడులో దాడికి గురై తీవ్రంగా గాయపడిన బాలిక ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. బెంగళూరులోని Manipal Hospitalలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్యంపై మంత్రి నారా లోకేశ్ వైద్యులతో Video Conference నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు. బాలిక త్వరగా కోలుకుంటుండటంతో త్వరలోనే ఆస్పత్రి నుంచి Discharge చేసే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.
వైద్యుల సమాచారం ప్రకారం, ప్రస్తుతం బాలిక Ventilator Support లేకుండానే శ్వాస తీసుకుంటోంది. Oxygen Levels నిలకడగా ఉన్నాయి. నోటి ద్వారా ఆహారం తీసుకుంటుండటంతో పాటు ఇతరుల సహాయంతో నెమ్మదిగా నడవడం ప్రారంభించింది. ప్రధాన గాయాలు కూడా మానడంతో కుట్లు తొలగించారు. కుడిచేత్తో గ్లాస్ పట్టుకోగలుగుతోందని, తిరిగి పెన్ను పట్టుకుని రాసేందుకు Rehabilitation Exercises అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
బాలిక ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో కోలుకునే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఇంటి వద్దే Medical Support, Physiotherapy, Rehabilitation, Psychological Counselling అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాలిక శారీరకంగా, మానసికంగా కోలుకుని తిరిగి సాధారణ జీవితాన్ని ప్రారంభించే వరకు అవసరమైన సహాయం అందిస్తామని స్పష్టం చేశారు
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment