రైతన్నలకు రహదారి కష్టం.. నడుములోతు గుంతలు! బురదలో కూరుకుపోతున్న ఎడ్లు | Mancherial
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం వీరాపూర్‌లో రైతులు (Farmers) పడుతున్న రహదారి కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. పొలాలకు వెళ్లే రోడ్డు (Road) పూర్తిగా అధ్వాన్నంగా మారి, నడుము లోతు గుంతలు మరియు బురదమయంగా తయారైంది. వ్యవసాయ సీజన్‌లో ఎరువులు, విత్తనాలు తీసుకెళ్లాలన్నా, ఎడ్ల బండ్లు (Bullock Carts) తో పొలాలకు వెళ్లాలన్నా రైతులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.
ఈ దుస్థితి కారణంగా బురదలో ఎడ్లు కూరుకుపోతుండటంతో రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు (Officials) కి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా రోడ్ల పరిస్థితి మాత్రం మారడంలేదని వారు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల అడుగడుగునా నరకం చూస్తున్న రైతుల కష్టాలపై రూపొందించిన ఈ ప్రత్యేక కథనాన్ని Sandesh TV లో వీక్షించండి!