ఒక చిన్న ఆన్‌లైన్ పరిచయం.. ఆపై స్నేహం.. నమ్మకం..! చివరకు అదే పరిచయం దోపిడీకి మార్గమైంది!

గ్రైండర్ (Grindr) డేటింగ్ యాప్‌ను అడ్డుపెట్టుకుని అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్న ఐదుగురు సభ్యుల ముఠాను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల విచారణలో ఈ ముఠా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 14 నేరాలకు పాల్పడినట్లు వెల్లడైంది. విశాఖపట్నం, కుషాయిగూడ, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

ఏఎస్ రావు నగర్‌లో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి నుంచి సుమారు 36 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి వెల్లడించిన వివరాలు, ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌ల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ కథనంలో తెలుసుకోండి.

⚠️ యువతకు పోలీసుల హెచ్చరిక: ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తులను గుడ్డిగా నమ్మకండి. వ్యక్తిగత, ఆర్థిక వివరాలను అపరిచితులతో పంచుకోవద్దు. అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించండి.

🔴 ఇలాంటి క్రైమ్ వార్తలు, బ్రేకింగ్ న్యూస్, తాజా తెలుగు వార్తల కోసం సందేశ్ టీవీని Subscribe చేయండి.

👍 Like | 💬 Comment | 🔔 Subscribe | 📲 Share

సందేశ్ టీవీ – ప్రజల కోసం.. ప్రజల గొంతుకగా!

WATCH THE VIDEO